పరమగీతము 6 : 1 (TEV)
స్త్రీలలో అధిక సుందరివగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడేదిక్కునకు తిరిగెను?
పరమగీతము 6 : 2 (TEV)
ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను పరిమళ పుష్పస్థానమునకు పోయెను.
పరమగీతము 6 : 3 (TEV)
నేను పద్మములలో మేపుచున్న నా ప్రియునిదానను అతడును నావాడు.
పరమగీతము 6 : 4 (TEV)
నా సఖీ, నీవు తిర్సాపట్టణమువలె సుందరమైన దానవు. యెరూషలేమంత సౌందర్యవంతురాలవు టెక్కెముల నెత్తిన సైన్యమువలె భయము పుట్టించు దానవు
పరమగీతము 6 : 5 (TEV)
నీ కనుదృష్టి నామీద ఉంచకుము అది నన్ను వశపరచుకొనును నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది మేకలమందను పోలియున్నవి.
పరమగీతము 6 : 6 (TEV)
నీ పలువరుస కత్తెర వేయబడినవియు కడుగబడి యప్పుడే పైకి వచ్చినవియునై జోడుజోడు పిల్లలు కలిగి ఒకదానినైన పోగొట్టు కొనక సుఖముగానున్న గొఱ్ఱల కదుపులను పోలియున్నవి.
పరమగీతము 6 : 7 (TEV)
నీ ముసుకుగుండ నీ కణతలు విచ్చిన దాడిమ ఫలమువలె అగపడుచున్నవి.
పరమగీతము 6 : 8 (TEV)
అరువదిమంది రాణులును ఎనుబదిమంది ఉపపత్ను లును లెక్కకు మించిన కన్యకలును కలరు.
పరమగీతము 6 : 9 (TEV)
నా పావురము నా నిష్కళంకురాలు ఒకతే ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె కన్నతల్లికి ముద్దు బిడ్డ స్త్రీలు దాని చూచి ధన్యురాలందురు రాణులును ఉపపత్నులును దాని పొగడుదురు.
పరమగీతము 6 : 10 (TEV)
సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందముగలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలునుగలదై వ్యూహితసైన్య సమభీకర రూపిణియునగు ఈమె ఎవరు?
పరమగీతము 6 : 11 (TEV)
లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షావల్లులు చిగిర్చెనో లేదో దాడిమవృక్షములు పూతపట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్లితిని.
పరమగీతము 6 : 12 (TEV)
తెలియకయే నా జనులలో ఘనులగువారి రథములను నేను కలిసికొంటిని.
పరమగీతము 6 : 13 (TEV)
షూలమీ్మతీ, రమ్ము రమ్ము మేము నిన్ను ఆశతీర చూచుటకై తిరిగిరమ్ము, తిరిగి రమ్ము. షూలమీ్మతీయందు మీకు ముచ్చట పుట్టించునదేది? అమె మహనయీము నాటకమంత వింతయైనదా?

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13